Andhra Pradesh High Court - YS Jaganనిన్నటివరకు కోర్టులని బూతులు తిట్టేవారు ఏపీ మంత్రులు. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఆ పార్టీ సోషల్ మీడియా సెల్ తో సమానంగా కోర్టులను దూషించి కోర్టు ధిక్కార కేసులు ఎదురుకున్నారు. కోర్టులను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నారని… తన కులానికే చెందిన ఎన్వీ రమణ తో హైకోర్టుని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించేవారు.’

అయితే ఉన్నఫళంగా వారికి కోర్టుల మీద ఎనలేని నమ్మకం ఏర్పడింది. మొన్న ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాగానే ప్రభుత్వానికి అనుకూలంగా ఒక తీర్పు వచ్చి పంచాయితీ ఎన్నికలు రద్దయ్యాయి. అక్కడి నుండి అధికార పక్ష నేతలకు కోర్టుల మీద ఎనలేని విశ్వాసం పెరిగిపోయింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఒక ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల నోటిఫికేషన్‌ వెనక దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో కోర్టు తీర్పుల మీద సజ్జల కూడా అనేక పర్యాయాలు పెదవి విరిచారు. ఉన్నఫళంగా పెద్ద మార్పే వచ్చింది.

అంతటితో ఆగకుండా… నాలుగు నెలల్లో విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు కానుందని చెప్పారు. అప్పటికల్లా కోర్టుల్లో అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదంతా ప్రధాన న్యాయమూర్తి మారగానే కోర్టుల మీద పెరిగిన విశ్వాసమా లేక ప్రభుత్వానికి ఇక నుండి కోర్టులలో ఇబ్బంది ఉండదని ఎటునుండైనా హామీ వచ్చిందా? అని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.