No luck to eesha rebba with Subrahmanyapuramటాలెంట్ ఉన్న ‘ఆర్టిస్ట్స్’ చాలా అరుదుగా దొరుకుతారు. అయితే అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ లో అందాల భామ ఈషా రెబ్బ పేరు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే అరవింద సామెతాలో మంచి పాత్ర పడింది అని అనుకున్న ఈషాకు ఆ పాత్రకి పెద్ద డైలాగ్స్ లేవు అని జస్ట్ స్క్రీన్ పై కనిపించడానికి తప్ప ఆ పాత్ర ఎందుకు పనికి రాలేదు అని సినిమా రిలీజ్ వరకూ తెలియలేదు.

ఇక తాజాగా అక్కినేని సుమంత్ హీరోగా వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’లో కూడా ఇషాకి మంచి పాత్రే పడింది అనే కన్నా పెద్ద పాత్రే పడింది. కాకపోతే దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు అనే చెప్పాలి..ఎందుకంటే సీన్స్ అయితే ఎక్కువగానే రాసుకున్నాడు కానీ, ఆ పాత్రకి ఇంకాస్త ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బావుండేది అన్నది ప్రేక్షకుల ఆలోచన.

అయితే స్పష్టంగా చెప్పాలి అంటే…ఈషా రెబ్బా లాంటి ఆర్టిస్ట్స్ దొరికితే దర్శకులు తమ రైటింగ్ తో రఫ్ ఆడించాలి కానీ ఇలా సో సో గా ఆమెకు పాత్రలను ఇస్తూ ఆమెను పెద్దగా పాటించుకోవడంలేదు అనే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం మంచి స్కోప్ ఉన్న పాత్ర పడాలె కానీ ఆ పాత్రలో ఒదిగిపోతుంది ఈషా…మరి ఆమె కెరీర్ కి టర్నింగ్ ఇచ్చే దర్శకుడు ఎవరో…పాత్ర ఏదో కాలమే నిర్ణయించాలి.