no luck for eesha rebba after aravindha samethaతెలుగు హీరోయిన్ గా కాస్త చెప్పుకోదగిన సినిమాలే ఈషా రెబ్బా చేస్తోంది. ‘అరవింద సమేత’కు ముందు చిన్న చిన్న సినిమాల్లో కథానాయికగా కనిపిస్తూ వచ్చింది. దీంతో ఈ భారీ సినిమాపై బోలెడు ఆశలనే పెట్టుకుంది. ఆమె కెరియర్లో పెద్ద సినిమాగా మంచి పేరు వస్తుందనీ, బిజీ అవుతుందని అంతా అనుకుంటే, దానికి ఏ మాత్రం సంకేతాలు కనిపించకపోవడంతో నిరుత్సాహంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

‘అరవింద సమేత’ సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడం వలన, ఆమె ప్రభావం ప్రేక్షకులపై అంతగా లేకుండా పోయింది. దాంతో ఈషా రెబ్బాకి ఆశించిన స్థాయిలో ఈ సినిమా క్రేజ్ తీసుకురాలేకపోయింది. తదనంతరం పర్యవసానాలు ఆమెను వెతుక్కుంటూ రావడం లేదు.

‘అరవింద’కి ముందు ఈషాకి రెండు సినిమాలు రాగా, ‘అరవింద’ను చూసుకుని ఆమె వాటిని వదిలేసిందట. ఇప్పుడు ఆ రెండు సినిమాలు పోయినందుకు .. ‘అరవింద’ చేసినందు వలన పెద్దగా ప్రయోజనం లేనందుకు ఈషా నిరాశకి లోనైందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.