No Invitation to Pawan Kalyan and YS jagan from JDSకర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీ నేతలందరికీ ఆహ్వానాలు పంపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ను వంచించినందుకు కేంద్రంపై పోరాటం చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వైకాపా, జనసేన అధినేతలకు మాత్రం ఆహ్వానం అందలేదు.

కుమారస్వామి పవన్ కళ్యాణ్ కు చాలా క్లోజ్. ఒకదశలో పవన్ కళ్యాణ్ జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే అది జరగలేదు. టీడీపీ వర్గాల ప్రకారం పవన్ కళ్యాణ్ బీజేపీ వైపు ఉన్నాడని కుమారస్వామి గ్రహించినందువల్లే ఆహ్వానం పంపలేదని అంటున్నారు.

మరోవైపు వైకాపా బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నారని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. దీనితో జగన్ కు కూడా ఆహ్వానం రాలేదు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. చంద్రబాబు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ ముందే వెళ్లి కనిపించి వచేస్తారట కాంగ్రెస్ తో వేదిక పంచుకోకుండా.