no invitation for YS Jagan to lunch with Donald Trumpఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియా… సాక్షి. జగన్ ప్రభుత్వానికి, పార్టీకి ఆ మీడియా అనుకూలంగా పని చేస్తుంది అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే తాము నిస్పక్షపాతంగా వ్యవహరిస్తాం అని సాక్షి వారు చెప్పుకున్నా కొన్ని కొన్ని సార్లు మరీ ఓపెన్ గా పక్షపాతాన్ని చూపించేస్తారు.

అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు రాష్ట్రపతి భవన్ లో రేపు మధ్యాహ్నం విందు ఇస్తున్నారు. దానికి కొందరు ముఖ్యమంత్రులను పిలుస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆహ్వానం అందింది.

అయితే జగన్ ను మాత్రం పిలవలేదు. ఏ ప్రాతిపదికన ముఖ్యమంత్రులను ఎంపిక చేశారో గానీ జగన్ ని మాత్రం పిలవలేదు. ట్రంప్ పర్యటన గురించి వివరంగా ఆయనకు వడ్డించే వంటకాలతో సహా చెప్పిన సాక్షి… ఈ సంగతి మాత్రం చెప్పలేదు. అదే గాక… ట్రంప్ సతీమణి, మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారట.

అయితే ఆ పర్యటనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని గానీ మనీష్ సిసోడియాని గానీ పిలవలేదని ప్రముఖంగా ప్రచురించింది. ఇంత విస్తారంగా కవర్ చేసి జగన్ ను పిలవలేదు అనే దానిని దాచిపెట్టడంతో సాక్షి తన పక్షపాతాన్ని బయటపెట్టుకుంది అని సోషల్ మీడియాలో పలువురు ఆక్షేపిస్తున్నారు.ఎం