YS Jagan - Ramoji Raoప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తన సహజ శైలికి విరుద్ధంగా రామోజీ రావు వద్దకు వెళ్లి పాదయాత్రను ఆశీర్వదించాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు. వైఎస్సాఆర్ బద్ద శత్రువులా చుసిన రామోజీ రావుతో జగన్ సంధి చేసుకోవడం ఆయన మద్దత్తు దారులకు కూడా నచ్చలేదు. అయితే కాళ్ళ బేరానికి వెళ్లిన జగన్ కు రామోజీ రావు సహకరించేలా కనిపించడంలేదు.

జగన్ పాదయాత్ర మొదలయ్యి రెండు వారల పైగా అయినా ఈనాడు పెద్దగా కవరేజ్ ఇచ్చింది లేదు. అప్పట్లో రాజశేఖర రెడ్డి పాదయాత్రకు ఇచ్చిన కవరేజ్ తో పోలిస్తే జగన్ కు ఇచ్చింది ఏమి లేదు. పైగా ఈరోజు మెయిన్ పేపర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లిస్టులో జగన్ ఏడవ ర్యాంక్ లో ఉన్నట్టు ప్రముఖంగా ప్రచురించింది.

వైఎస్ జగన్ తనకు చెందిన 31 సూట్ కేస్ కంపెనీల ద్వారా 368 కోట్లు హవాలా ద్వారా మళ్లించినట్టు ఈడీ అభియోగం. ఈ వార్త రాజకీయంగా జగన్ ను ఇబ్బంది పెట్టేదే. నిన్నటి వరకు ఇంగ్లీష్ వార్త పత్రికలో మాత్రమే ఉన్న ఈ వార్త ఈనాడులోకి రావడంతో జగన్ కు మరింత ఇబ్బంది. అబ్బా రామోజీ దెబ్బేసాడే అని ఆ పార్టీ వారు అనుకుంటున్నారట!