Mahesh Babu Sarileru Neekevvaruసూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్ వచ్చే నెల మొదటి వారంలో మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆయన ఒక ఆర్మీ సోల్జర్ గా కనిపించబోతున్నారు. దీనితో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు ఫిలింనగర్ లో షికారు చేస్తున్నాయి. మహేష్ బాబు సినిమాకోసం విదేశీ టీమ్ ను యాక్షన్ సీన్ల కోసం తీసుకువస్తున్నారని, వాళ్లతో మహేష్ కు ట్రయినింగ్ వుంటుందన్నది ఒక గాలి వార్త వచ్చింది. అయితే చిత్ర బృందంలోని విశ్వసనీయ సమాచారం ప్రకారం అటువంటిది ఏమీ లేదు.

ఈ సినిమాకు ఏ విదేశీ నిపుణులు పనిచేయడం లేదని, రామ్ లక్ష్మణ్ మాస్టర్ నే పని చేస్తారని తెలుస్తుంది. కాశ్మీర్ షెడ్యూల్ లోని ఒక ఫైట్ కు మాత్రం స్థానిక సైనిక అధికారుల సాయం తీసుకోనున్నారట. కాశ్మీర్ లో ఓ రెస్క్యూ ఆపరేషన్ సీన్, హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాంటివి చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రిలీజ్ అంటున్నారు కాబట్టి ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ చెయ్యాల్సి ఉంది. పక్కా కమర్షియల్ అంశాలు మేళవించిన సినిమాగా….మంచి యాక్షన్ సినిమాగా ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా, జెమినీ టీవీ టీవీ ప్రసారహక్కులను కొనుగోలు చేసింది