No darshan at Tirumala temple for five days in Augustతిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9వ తేదీ నుంచి 17 వరకు 9 రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయనుంది. తిరుమలలో 12 ఏళ్లకోసారి నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమం కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ధర్మకర్తల మండలి తెలిపింది. .

ఈ నిర్ణయం ప్రకారం 9వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకు భక్తుల రాకను నిలిపివేయనున్నారు. మహా సంప్రోక్షణ జరపాలన్న ఆగమ పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే స్వామి వారి ఆలయాన్ని చుట్టుముడుతున్న వివాదాలు కూడా ఈ సంప్రోక్షణతో పోతాయని అంతా భావిస్తున్నారు.

అయితే ఎన్నో నెలలుగా చాలా మంది భక్తుల వేసుకున్న ప్రణాళికలు మార్చుకోవాల్సి ఉంటుంది. నిత్యం లక్షలాధి మందితో కళకళలాడే తిరుమల బోసిపోనుంది. మరోవైపు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ ప్రవాస భారతీయుడు భారీ మొత్తంలో విరాళం అందజేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి వివిధ ట్రస్టులకు 13.50 కోట్ల విరాళాన్ని ఆయన సమర్పించారు.