no-confidence-YS-Jaganరాజకీయాలలో ఒక్కోసారి అనాలోచితంగా చేసే పనులు వెనక్కు వచ్చి చేసినవారినే వెక్కిరిస్తాయి. సరిగ్గా ఇలాంటిదే జరిగింది వైకాపా రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి. గత పార్లమెంట్ సమావేశాల్లో టీడీపీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సరైన కేటాయింపులు లేవని తప్పు పట్టారు.

వెంటనే విజయసాయిరెడ్డి లేచి కేంద్ర కేబినెట్ లో ఉంటూ బడ్జెట్ ని ఎలా వ్యతిరేకిస్తారు? మీరు ఆమోదించిన బడ్జెట్ ను మీరే ఎలా తప్పంటారు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటూ తప్పు పట్టే ప్రయత్నం చేసారు. అంతటితో ఆగకుండా వెళ్ళి డైరెక్టుగా ప్రెసిడెంట్ కు కూడా కంప్లయింట్ ఇచ్చి వచ్చారు.

ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తుంటే ఇదెక్కడి రచ్చ అని అంత ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వైకాపా టీడీపీని కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వంలో ఉంటూ బడ్జెట్ ను వ్యతిరేకించడం తప్పు అన్నప్పుడు ప్రభుత్వంలో ఉండగా అవిశ్వాసం పెట్టమని టీడీపీ ని ఎలా డిమాండ్ చేస్తున్నారు మీరు అని సోషల్ మీడియాలో అంత ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా?