christian yv subba reddy- TTD chairmanతిరుమలలో ఇక అందరు భక్తులూ సమానమే అని, వీఐపీలు సామాన్యులు అనే తేడా లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఊదరగొట్టారు. అయితే ఇప్పుడు అదంతా హడావిడే అని తేలిపోయింది. తిరుమలలో వీఐపీ దర్శనాలను ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3లుగా వర్గీకరించడాన్ని మాత్రమే ఉపసంహరించుకున్నామని, పాత పద్ధతిలో ఉన్న వీఐపీ బ్రేక్‌ దర్శన విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

వీఐపీ బ్రేక్‌ దర్శనం పేరుతో సాధారణ భక్తుల ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నట్లు ఆరోపిస్తూ ఒక భక్తుడు హై కోర్టు తలుపు తట్టారు. అయితే పిటిషనర్‌ చేస్తోన్న వాదన సరికాదన్నారు. సాధారణ భక్తుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదన్నారు. పిటిషనర్ చేస్తున్న వాదనలో ఎటువంటి ప్రజాహితం లేదని టీటీడీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పిల్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు. శుక్రవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును వాయిదా(రిజర్వు) వేసింది.

” భద్రత కారణాల దృష్ట్యా వీఐపీ, వీవీఐపీలను సాధారణ భక్తులతో దర్శనానికి అనుమతించడం లేదు. రోజుకు గరిష్ఠంగా మూడు గంటలకు మించి వారికి దర్శన సమయాన్ని కల్పించడం లేదు. రద్దీ సమయాల్లో వీఐపీ దర్శనాల్ని కుదిస్తున్నాం. బ్రేక్‌ దర్శనాల్ని రద్దు చేస్తున్నాం,” అంటూ టీటీడీ వీఐపీ బ్రేక్‌ దర్శన విధానాన్ని సమర్ధించుకుంది. కలియుగ వైకుంఠం అని పిలుచుకునే తిరుమలకు రోజుకు సగటున 70 వేల మంది భక్తులు వస్తున్నారు. గంటలపాటు లైన్ లో నిలబడే చాలా మంది భక్తులకు కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే స్వామివారి దర్శనభాగ్యం కలుగుతుంది.