NTR-Biopic-Mahanayakudu-తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన ‘ఎన్ఠీఆర్’లాంటి మహా మనిషి సినిమానే మన తెలుగు వారికి బోర్ కొట్టేసింది. అయితే ఎన్ఠీఆర్ పై గౌరవం తగ్గిందా? లేక ఇతరత్రా కారణాల వల్ల సినిమాకి వసూళ్లు రావడం లేదా అంటే ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సినిమా బావున్నా సినిమాకి వసూళ్లు రావడం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న కధనం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కొన్న వారికే సెకండ్ పార్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి, అదీ ఫ్రీగా. అదేంటి అంటే, తొలి భాగంలో బయ్యర్స్ కి భారీ నష్టాలే మిగిలాయి, కనీసం మలిభాగం అయినా బ్రతికిస్తుందా అంటే, చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా తొలి భాగం నష్టాలు పూడాలి, మలి భాగం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు రావాలి, అవన్నీ అవ్వాలి అంటే, ఏదైనా వింత జరగాలి. ఒక పక్క సినిమా రెండో భాగం ను బయ్యర్స్ కి ఫ్రీ గా ఇచ్చినా లాభాలు వచ్చే అవకాశాలు చాల తక్కువే.

ఇక మరో పక్క బాలయ్య అన్నీ పక్కన పట్టి తన సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్స్ కి తోడుగా ఉండడానికి సిద్ధపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, ఎన్ఠీఆర్ రెండో భాగం అయినా మంచి టాక్ వచ్చి, భారీ హిట్ అయితే తప్ప, బయ్యర్స్ కోలుకోవడం అన్నది కష్టం అనే చెప్పాలి. చూద్దాం మరి ఏం జరగబోతుందో.