Sye Raa Narasimha Reddy - Saahoయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి వారాంతంలో, వినాయక చవితి పేరిట సోమవారం సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఇరగదీసింది. అయితే అమెరికాలో మాత్రం చిత్రం ఇప్పటిదాకా యావరేజ్ పెర్ఫార్మన్స్ తోనే సరిపెట్టింది. పూర్తి రన్ లో కేవలం మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం ఎనిమిది మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టాలి.

అంటే అమెరికాలో చిత్రం భారీ ప్లాప్ అనే చెప్పుకోవాలి. సినిమా టాక్ తో పాటు దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్ తప్పిదాలు కూడా ఎక్కువే. ఇందులో ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే చిత్రాన్ని అమ్మకుండా డిస్ట్రిబ్యూటర్ మొత్తం లాస్ అంతా తానే తీసుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ ఎఫెక్ట్ సైరా మీద పడే అవకాశాలు ఉన్నాయి. సైరా ఓవర్సీస్ రైట్స్ అమ్మకుండా సాహూ కోసం చూశాడు రామ్ చరణ్. సాహూ సక్సెస్ అయితే మంచి రేటు వస్తుందని ఆశపడ్డాడు.

అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. సాహూ దెబ్బకు సైరా దగ్గరకు వెళ్ళడానికే భయపడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఈ తరుణంలో సైరాకు మంచి రేటు రావడం కష్టమనే చెప్పుకోవాలి. సైరా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. 1న అమెరికా లో ప్రీమియర్లు ఉంటాయి. అక్టోబర్ 1 మంగళవారం కావడంతో అమెరికాలో సహజంగా ఉండే ఆఫర్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఖైదీ నెం 150 ప్రీమియర్లేకే వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ రాబట్టింది. సాహూకి కూడా అది సాధ్యపడలేదు. చిరంజీవి ఏం చేస్తారో చూడాలి.