nizamabad farmers nomination against narendra modiతమ సమస్యలను జాతీయ స్థాయిలో చెప్పవచ్చని యాభై మంది నిజామాబాద్ రైతులు ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నామినేషన్లు వెయ్యడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే వారణాసి చేరిన రైతులను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటలిజెన్స్ పోలీసులు వారిని నిత్యం వెంబడిస్తున్నారు. ప్రశ్నలతో వేధిస్తున్నారు. స్థానిక బీజేపీ నేతలు వారిని నామినేషన్లు వెయ్యకుండా అడ్డుకుంటున్నారు. వారికి నామినీలు దొరక్కుండా అడ్డుతగులుతున్నారు.

నిజామాబాద్ రైతులతో పాటు తమిళనాడు రైతులు కూడా ప్రధానికి వ్యతిరేకంగా నామినేషన్ వెయ్యడానికి వెళ్లారు. వారిదీ ఇదే పరిస్థితి అని తెలుస్తుంది. ఈ నెల 11వ తేదీన నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 178 పసుపు రైతులు పోటీ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కేసీఆర్ కుమార్తె కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. మే 19న అంటే చివరి దశ పోలింగ్ లో వారణాసి ఎన్నికలు జరుగుతాయి.

ఏప్రిల్ 29 నామినేషన్ల సమర్పణకు చివరి తేది. వీరు నామినేషన్లు వెయ్యగలుగుతారో లేదో చూడాలి. నిన్న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ తన నామినేషన్ వేశారు. 2014లో రెండు చోట్ల నుండి పోటీ చేసిన మోడీ ఆ తరువాత వారణాసిని మాత్రమే ఉంచుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండే పోటీ చేస్తున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై 3,71,784 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సారి ఐదు లక్షల మెజారిటీ టార్గెట్ అంటున్నారు బీజేపీ వారు.