Minister of State for Home Affairsఆంధ్రప్రదేశ్ కు లభించాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ విషయంలో కేంద్రం ఒక “ఆట” ఆడుకుంటోంది. ‘నీతి అయోగ్’ పరిధిలో ఉందని ఇన్నాళ్ళు మాట దాటవేస్తూ వచ్చిన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జవాబు చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. అయిదేళ్ళు సరిపోదు, కనీసం పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా లేకపోతే ఏపీ అభివృద్ధి చెందడం కష్టమని పార్లమెంట్ వేదికగా వెంకయ్య నాయుడు చేసిన మాటలు ఒట్టి నీటి మూటలేనని ‘నీతి అయోగ్’ నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం.

14వ సంఘం సిఫారసు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని, పన్ను రాయితీలు ఇస్తే చాలని, అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ లు ఇస్తే సరిపోతుందని నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రి హరిభాయ్ చౌదరి ఒక ప్రకటన చేసారు. దీంతో స్పెషల్ స్టేటస్ పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్న ఈ ప్రకటన పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.