Rang De Nithiinయంగ్ హీరో నితిన్ నటిస్తున్న రంగ్ దే ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చెక్ తో ప్లాప్ మూటగట్టుకున్న నితిన్ కు ఈ సారి మంచి శకునాలే ఎదురవుతున్నాయి. ట్రైలర్ సినిమా మీద అంచనాలు భారీగా పెంచింది. ఆన్ లైన్ ప్రమోషన్ల తో పాటు ఆఫ్ లైన్ ప్రమోషన్లు కూడా ఇరగదీస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ కామెడీ… సెకండ్ హాఫ్ ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నితిన్ ధీమా గా ఉన్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ఎమోషన్లగా ఉంటుందని… హీరో హీరోయిన్ల కేరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చిత్రబృందం కాన్ఫిడెంట్ గా ఉంది. సహజంగా ఒక సినిమాకు క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్.

సినిమా అంతా ఒక ఎత్తు… క్లైమాక్స్ చూసి బయటకు వచ్చే ఆడియన్స్ కు మంచి క్లైమాక్స్ తో పంపిస్తే ఆ ఫీలింగే వేరు. దానితో సినిమా మీద గుడ్ విల్ తో బయటకు వెళ్తారు. ఒకవేళ ఈ క్లైమాక్స్ విషయం గనుక నిజమైతే సినిమా రేంజ్ బాగా పెరుగుతుంది. లాస్ట్ వీకెండ్ తెలుగు చిత్ర పరిశ్రమకు భారీగా నిరాశపరిచింది.

విష్ణు మంచు యొక్క మోసగాళ్లు, కార్తికేయ యొక్క చావు కబురు చల్లగా, మరియు ఆది యొక్క శశి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా ముగిశాయి. ఈ సమయంలో హిట్ కొట్టడానికి నితిన్ కు ఇది మంచి అవకాశం. మొదటి వారాంతం తరువాత సోమవారం హోలీ హాలిడే రావడం చిత్రానికి బాగా కలిసివస్తుంది. ఒకవేళ మంచి టాక్ వస్తే వసూళ్లు భారీగా ఉంటాయి.