Nithiin-Chal-Mohan-Ranga-Movie-Talkనితిన్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన “చల్ మోహన్ రంగ”ను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై నిర్మించడం, త్రివిక్రమ్ శిష్యుడు దర్శకత్వం వహించడంతో ప్రేక్షకులలో ఆసక్తిని నింపింది. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? త్రివిక్రమ్ ‘అ… ఆ…’ మాదిరి నితిన్ కు మరో బంపర్ హిట్ ను అందించిందా? అంటే ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా పవన్ + త్రివిక్రమ్ ల కాంబోలో నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా కొత్తగా ఉంటుందని ఆశించారు. కానీ ఒక ప్రేమకధకు ఫన్నీ ఇన్సిడెంట్స్ యాడ్ చేసి రొటీన్ గా తెరకెక్కించడం అనేది కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు సంతృప్తిని ఇవ్వని అంశం. అయితే దర్శకుడు కృష్ణ చైతన్య రాసిన సంభాషణలు సిల్వర్ స్క్రీన్ పై ‘త్రివిక్రమ్ బ్రాండ్ ఫన్’ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.

ప్రేక్షకుల నుండి పూర్తి నెగటివ్ టాక్ రాలేదు, అలాగని పూర్తి సంతృప్తిని కలిగించలేకపోయింది. ముఖ్యంగా ‘ఎ’ సెంటర్ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమైన సినిమాగా టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘రంగస్థలం’ చేస్తోన్న వీరవిహారాన్ని తట్టుకుని ఈ రొటీన్ “చల్ మోహన్ రంగ” ఎంతవరకు నిలబడుతుందనేది వేచిచూడాలి. ఏపీ, తెలంగాణాలతో పాటు యుఎస్ లోనూ భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలైంది.