Nirmala Sitharamanకరోనా వైరస్ ప్రపంచానంతటినీ వణికిస్తోంది. జనజీవితం అస్తవ్యస్తం అయ్యింది. ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. ప్రపంచమంతా ఆ భయంకర వైరస్ ని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా ఎప్పుడు పరిస్థితి సాధారణం అవుతుందా అని ప్రజలు చూస్తుంటే అది ఇప్పుడు బీజేపీకి ఎన్నికల స్టంట్ గా మారిపోయింది.

వచ్చే నెలలో జరిగే బీహార్ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టో లో కూడా ఫ్రీ వ్యాక్సిన్ పెట్టేస్తారు. ఇది ఏదో ఆ రాష్ట్ర నాయకుడు అంటే పర్లేదు. సాక్షాత్తు దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మ్యానిఫెస్టో లాంచ్ చేస్తూ చెప్పుకొచ్చారు. “వ్యాక్సిన్ భారీ స్థాయిలో ఉత్పత్తికి అందుబాటులోకి వచ్చిన వెంటనే, బీహార్‌లోని ప్రతి వ్యక్తికి ఉచిత టీకా లభిస్తుంది. ఇది మా పోల్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న మొదటి వాగ్దానం,” అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇటీవలే ప్రపంచంలోనే ఒకానొక అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు… సీరం ఇన్సిట్యూట్ అధినేత ఆడార్ పూనావాలా మాట్లాడుతూ… దేశంమొత్తానికి వ్యాక్సిన్ ఇవ్వడానికి కనీసం 80,000 కోట్లు ఉండాలని చెప్పుకొచ్చారు. అది కూడా కంప్లీట్ గా ఫ్రీగా కాదు. అసలు ఆ వైపుగా కేంద్రం దృష్టి సారించినట్టే ఇప్పటిదాకా సమాచారం లేదు.

మరోవైపు…వ్యాక్సిన్ ఫ్రీగా అంటూ ఇవ్వడం అంటే అది బీహార్ లో మాత్రమే ఇవ్వడం ఏంటి? వ్యాక్సిన్ ఫ్రీగా అంటూ రాజకీయానికి వాడుకోవడం బీజేపీ రాజకీయ పతనావస్థను సూచిస్తుంది. “వ్యాక్సిన్ ఫ్రీగా అంటూ రాజకీయానికి వాడుకోవడం బీజేపీ రాజకీయ పతనావస్థను సూచిస్తుంది. ఆర్ధిక మంత్రితో ప్రకటన చేయించడం మరింత దారుణం,” అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.