Nirbhaya india case live updatesఅద్వితీయమైన చరిత్ర గల సువిశాల భారతదేశం…

ఒకప్పుడు స్త్రీలను దేవతలుగా పూజించిన ధరిత్రి…

కానీ అదే నేలపై ప్రస్తుతం “స్త్రీ” జన్మిస్తే… తల్లితండ్రులు భయపడాల్సిన పరిస్థితి…

28 రోజుల పసికందుపై కూడా ‘కామవాంఛ’ తీర్చుకుని కొత్త చరిత్రను లిఖిస్తున్న మరుభూమి…

ఏ రోజు ఎటువైపు నుండి ఎవరు వచ్చి ఎలా హింసిస్తారో అంచనా వేయడానికి అవకాశం లేనంతగా ఒక్కొక్కరు కొత్త కొత్త పద్దతులను కనిపెట్టి మరీ మహిళలపై తమ ‘మగతనం’ అనే ‘మృగత్వాన్ని’ ప్రదర్శిస్తున్నారు. దానికి ప్రత్యక్ష పైసాచికత్వానికి నిదర్శనమే… ఢిల్లీ వేదికగా జరిగిన “నిర్భయ” ఘటన. దేశం మొత్తం అవాక్కయ్యేలా చేసిన ఈ సంఘటనలో నిందితులు సృష్టించిన ఆరాచకం… మాటల్లో వ్యక్తపరచలేనిది… కవులకు సైతం జుగుప్స కలిగించేది…. ఒక్క మాటలో చెప్పాలంటే ‘నభూతో… నభవిష్యతి…’ అన్న విధంగా ఖ్యాతి పొందింది.

బహుశా… కోర్టు తీర్పు కూడా అంతే స్థాయిలో చరిత్ర పుటల్లో నిలవాలని భావించారో ఏమో గానీ… అంతటి ఆరచాకానికి కారణమైన ఓ నిందితుడిని ఈ రోజు కోర్టు విడుదల చేసింది. ‘’మైనర్ బాబులు… మీరు ఈ దేశంలో ఎలాంటి విధ్వంసాలైనా, ఏ విధమైన నేరాలైనా మరో ఆలోచన లేకుండా చేసుకోవచ్చు…’’ అనే విధంగా ఈ రోజు జరిగిన సంఘటన చాటి చెప్తోందని ఢిల్లీలోని ఇండియా గేట్ వేదికగా గొంతు చించుకుంటున్న గొంతులు ఎన్నో ఎన్నెన్నో..!

“నిర్భయ” వంటి దారుణమైన కేసుల్లోనే శిక్షలు ఈ విధంగా ఉంటే… ఇక సాధారణ కేసుల్లో శిక్షలు ఏ విధంగా ఉంటాయో అన్న సందేహం వలదు. ఎందుకంటే… ఒక చిన్న వేధింపు కేసులో ‘ఎన్ కౌంటర్’ అయినా చేసోయొచ్చు… అలాగే ‘నిర్భయ’ వంటి కేసులో విడుదల ఆయినా చేసేయొచ్చు… “రాజకీయ అవసరం ఉందంటే ఇండియాలో ఏదైనా సాధ్యపడుతుంది…” అదే లేదంటే న్యాయానికి జరిగేది అన్యాయమే అని భారతీయ న్యాయవ్యవస్థ నిరూపిస్తోంది. ఏదో కవి అన్నట్లు… ‘న్యాయం’ కంటే ‘అన్యాయం’ ఒక అక్షరం ఎక్కువ… అందుకే ఎప్పుడూ అదే గెలుస్తుంటుంది అని దేశ ప్రజలు తమకు తాము సర్దిచెప్పుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇక ముందు… న్యాయం, ధర్మం అంటూ ఎవరైనా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తే… కాస్త జాలిని ప్రదర్శిండం నేర్చుకోండి..!