Ninnu Road Meeda Song Trailerఅక్కినేని నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ రీమిక్స్ వెర్షన్ వీడియో సాంగ్ ను “సవ్యసాచి” చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. చైతూ – నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ పాట విజువల్స్, ఆడియో కంటే కాస్త బెటర్ గా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ నిధి అగర్వాల్ అందాల విందు చేసింది.

అలాగే అభిమానులకు ఊపు వచ్చే విధంగా చైతూ వేసిన స్టెప్స్ వీక్షకులను అలరిస్తాయి. ఆడియో పరంగా సాదాసీదాగా ఉన్న ఈ పాట విజువల్స్ లో కొంతవరకు సంతృప్తిని ఇస్తుంది. ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోజుకొక వీడియో సాంగ్ ను విడుదల చేస్తున్నారు.