ninnu-kori-adiga-adiga-song-teaserవరుసగా ఆరు హిట్లతో ‘డబుల్ హ్యాట్రిక్’ సాధించి, తన స్థాయి హీరోలకు అందనంత రేంజ్ లో ఉన్న ‘నాచురల్ స్టార్’ నాని, మరో ‘హ్యాట్రిక్’ సాధించి, ‘త్రిబుల్ హ్యాట్రిక్’ నమోదు చేస్తారా… అంటే… అలాంటి సంకేతాలనే “నిన్ను కోరి” సినిమా టీజర్ ఇస్తోంది. గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో విడుదలైన ఈ ఫస్ట్ టీజర్, ‘ఫీల్ గుడ్’ అనుభూతి ఇవ్వడంలో సక్సెస్ సాధించింది.

బీచ్ లోని రాళ్ళ పైన నాని, నివేదా థామస్ లు కూర్చుని ఉన్న ఈ సీన్ వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతోంది. అలా నివేదా వైపుకు చూస్తున్న ఉన్న నాని లుక్ పరంగా ఇంతకు ముందు సినిమాలకు, దీనికి పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ, సక్సెస్ ఊపులో ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతం ఏం చేసినా ప్రేక్షకులకు ఇంపుగానే ఉంటుంది. కాబట్టి ‘త్రిబుల్ హ్యాట్రిక్’ను ఈ “నిన్ను కోరి” సినిమాతో శ్రీకారం చుట్టినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.