Election-Commissioner-N-Ramesh-Kumar-Not-to-Come-to-Andhra-Pradeshమాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్ లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మాజీ రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ ని కలిసిన ఒక వీడియోని వైఎస్సార్ కాంగ్రెస్ విడుదల చేసింది. వేర్వేరుగా వచ్చి ఒకే రూంలో దాదాపుగా గంటన్నర సేపు వీరు భేటీ అయ్యారు.

ఈ వీడియో ప్రస్తుతం సెన్సషనల్ అవుతుంది. సాక్షి ఇది చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న కమ్మ కుట్ర అంటూ అభివర్ణిస్తుంది. అయితే హైదరాబాద్ లోని పార్క్ హయత్ సీసీటీవీ ఫ్యూటేజ్ బయటకు ఎలా వచ్చిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అసలు కేసు నమోదు చెయ్యకుండా హోటల్ వారు ఫ్యూటేజ్ ఎలా ఇచ్చారు అని చాలామంది అడుగుతున్నారు.

ఒకవేళ పోలీసు వారు ఈ ఫ్యూటేజ్ ని సంపాదించి ఉంటే ఏ ప్రాతిపదికన ఇది కేసు? కరోనా కారణంగా ఎంపీ సుజనా చౌదరి తన ఎంపీ ఆఫీసును పార్క్ హయత్ కు మార్చరట. వచ్చేపోయే వారితో ఇబ్బంది ఉండకూడదని. ఒక ఎంపీ మీద నిఘా పెట్టడానికి పోలీసులకు అనుమతి ఉందా అనేది ఇంకో ప్రశ్న.

ఒకవేళ సుజనా చౌదరి దీని మీద కంప్లయింట్ చేస్తే ఇబ్బందిగా మారొచ్చు. సాక్షి గానీ, ఏపీలోని అధికార పక్షం గానీ ఈ ఫ్యూటేజ్ ని విడుదల చేసినా వారికి ఇబ్బందే. మరోవైపు తనను ఇంకా ఎన్నికల అధికారిగా నియమించనందున నిమ్మగడ్డ హై కోర్టులో ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారణ పిటిషన్ వెయ్యబోతున్నట్టు సమాచారం.