Nimmagadda -Ramesh Kumar - YS Jaganరాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తికలిగిన రాజ్యాంగ వ్యవస్థ అని.. రాగద్వేషాలకు అతీతంగా ఎస్ఎఈసీ పనిచేస్తుందని నిమ్మగడ్డ అన్నారు.

గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభిస్తుందని ఆశిస్తున్నానన్న నిమ్మగడ్డ.. బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని జిల్లాల కలెక్టర్లు తెలియజేసినట్లు వివరించారు. నిమ్మగడ్డని సాగనంపడం ఆ తదనంతరం పరిణామాలు అందరికీ తెలిసిందే. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత ఆయన తిరిగి తన పదవి తెచ్చుకున్నారు.

ఈ క్రమంలో నిమ్మగడ్డ ప్రభుత్వం మీద ఏమైనా కక్షసాధింపుకు దిగుతారా అని వైఎస్సార్ కాంగ్రెస్ వారు భయపడుతున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు అప్పటివరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియ సజీవంగా ఉంటుందని నిమ్మగడ్డ ప్రకటించారు. అది ఒక రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి.

అంగ బలం, అర్ధ బలం తో సాధించుకున్న ఏకగ్రీవాలు సజీవంగా ఉన్నాయి. అయితే నిమ్మగడ్డ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి… ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి.