nikita-thukral-wedding‘హాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ప్రముఖ సినీ నటి నిఖితా తుక్రాల్ సినిమాలకు ‘బాయ్’ చెప్తూ, మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలెక్కనుంది. అక్టోబర్ 9వ తేదీన ముంబయికి చెందిన వ్యాపారవేత్త గగన్‌ దీప్‌ సింగ్ ను వివాహం చేసుకోనుంది. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరి పెళ్ళికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ బంధం ద్వారా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో హీరోయిన్ నిఖిత, గగన్ దీప్ సింగ్ పెళ్లికి ఇరువురి కుటుంబాలు ముహూర్తాన్ని ఫిక్స్ చేసాయి. ఈ నెల 9న ముంబైలోని ఓ స్టార్ హోటల్‌ లో తమ వివాహం ఘనంగా జరగనుందని నిఖిత తెలిపింది.

ఉత్తరాది సంప్రదాయం ప్రకారం జరిగే ఈ వివాహ కార్యక్రమాలలో భాగంగా, మెహంది, సంగీత్ కార్యక్రమాలు జరుగనుండగా శని, ఆది వారాల్లో వివాహం జరుగనున్నట్లు తెలిపింది. వివాహ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, వివాహానంతరం సినిమాల్లో నటించడంపై భర్తతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని నిఖిత చెప్పింది. దాదాపుగా అన్ని దక్షిణాది భాషలలో నటించిన ఈ ముద్దుగుమ్మకు సరైనది ఒక్క బ్రేక్ కూడా రాకపోవడంతో… ఇక తన సినీ కెరీర్ కు ముగింపు పలకడమే ఉత్తమమని, పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది.