నట్టి ముద్ర తొలగించుకున్న నిఖిల్

Promotions Restart With New Weaker Title Arjun Suravaramయువ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ముద్ర. ఈ సినిమా ప్రస్తుతానికి నిర్మాణ దశలో ఉంది. అయితే సీనియర్ నిర్మాత నట్టి కుమార్ జగపతి బాబు హీరోగా మరో సినిమా అదే టైటిల్ తో ఇటీవలే విడుదల చెయ్యడంతో ఈ విషయం కాస్తా వివాదాస్పమైంది. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను ‘అర్జున్‌ సురవరం’గా మారుస్తూ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో నిఖిల్‌ అర్జున్‌ లెనిన్‌ సురవరం అనే జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. చిత్ర షూటింగు దాదాపుగా పూర్తి అయ్యింది.

వ్యాను నుంచి నిఖిల్‌ కెమెరాతో ఓ దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఫస్ట్‌లుక్‌లో కన్పించారు. ఇందులో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సంతోష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తొలుత డిసెంబరు లో విడుదల చెయ్యాలి అనుకున్నా వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ను జోడించే నేపథ్యంలో ఆలస్యం కావడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజాగా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని నిర్మాతలు ప్రకటించారు.

ఔరా సినిమాస్‌, మూవీ డైనమిక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘ఠాగూర్‌’ మధు సమర్పిస్తున్నారు. గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు నిఖిల్. ఈ చిత్రంతో అయినా విజయాల బాట పట్టాలని ఆయన పట్టుదలగా ఉన్నాడు. అర్జున్ సురవరం తమిళ్ లో వచ్చిన కణ్ణితన్ అనే చిత్రం రీమేక్. నిఖిల్ గత చిత్రం కిరాక్ పార్టీ కూడా రీమేక్ చిత్రం కావడం విశేషం. మర్చిలో విడుదలయ్యే ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Follow @mirchi9 for more User Comments
Pressure Cooker Telugu Movie ReviewDon't MissPressure Cooker Review -Crumbles Under PressureBOTTOM LINE Crumbles Under Pressure OUR RATING 1.25/5 CENSOR 'U/A' Certified,2 hrs 07 mins What...Pawan Kalyan To Send A Strong Message to BJP LeadershipDon't MissPawan Kalyan To Send A Strong Message to BJP Leadership?Reports are emerging that Janasena President Pawan Kalyan will skip the Pro-CAA meeting in Hyderabad...Don't MissTeaser Talk: Another Faithful Adaptation?'Uma Maheshwara Ugra Rooasya' seems to be a faithful remake of the original movie when...Bheeshma Movie ReviewDon't MissBheeshma Review - Fun Ride All the WayBOTTOM LINE Fun Ride All the Way OUR RATING 2.75/5 CENSOR 2 hrs 31 mins...pic-talk-ileana--flaunting-those-awesome-absDon't MissBheeshma Treading A Fine Line On AdvancesThe Nithiin strarrer Bheeshma is all set to hit cinemas tomorrow (February 21st). It also...
Mirchi9