Niharika Konidela Khaidi No 150, Niharika Konidela Chiranjeevi Khaidi No 150, Niharika Konidela Chiru Khaidi No 150 Movie, Niharika Role Khaidi No 150మెగాస్టార్ 150వ సినిమాలో ఓ చిన్న పాత్ర లభించినా చాలని మెగా ఫ్యామిలీ హీరోలంతా వేచిచూస్తున్న తరుణంలో.., ఈ అవకాశం మెగా తనయురాలు నిహారికకు దక్కిందనేది లేటెస్ట్ న్యూస్. ‘ఒక మనసు’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన నిహారికను ‘ఖైదీ నంబర్ 150’లో ఓ అతిథి పాత్రకు ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల సమాచారం. ఇదే వార్త ఖరారైతే నిహారికకు ఒక బ్రేక్ లభించినట్లేనని, చిరు సినిమాలో మరో మెగా అట్రాక్షన్ గా నిహారిక మారడం ఖాయమని మెగా అభిమానులు భావిస్తున్నారు.

ఇక, రామ్ చరణ్ కూడా ఏదొక పాటలో తళుక్కుమనే విధంగా ప్లాన్ చేస్తున్నారని, ఇటీవల పరోక్షంగా ఈ విషయాన్ని కూడా ఖరారు చేశారన్నది మరో వార్త. షూటింగ్ పూర్తయిన తర్వాత ఏదైనా ఓ పాటలో అవకాశం వస్తే కనిపిస్తానని చెర్రీ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమాలో మెగా కుటుంబ సభ్యుల సందడి కూడా ఎక్కువగానే ఉండనుందని, అభిమానులకు ఈ సినిమా కన్నుల విందుగా మారడం ఖాయమేనని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.