New-Zealand-beat-Australia-now-india-to-winభారత్ – పాకిస్తాన్ జట్ల పోరును ఈ రెండు దేశాల అభిమానులు ఎలా వీక్షిస్తారో… న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ కు కూడా అంతే ఆదరణ ఉంటుంది. దాయాది దేశాలుగా పేరుబడ్డ ఈ రెండు దేశాల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో కివీస్ జట్టు సత్తా చాటి ప్రతీకారం తీర్చుకుంది. తొలి మ్యాచ్ లో టీమిండియాకు షాక్ ఇచ్చిన కివీస్ జట్టు, తాజాగా ఆసీస్ ను మట్టికరిపించి, టైటిల్ ఫేవరేట్ గా నిలిచింది.

తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 142 పరుగులు మాత్రమే చేసిన కివీస్ జట్టు, బౌలింగ్ లో మరోసారి సత్తా చాటి ఆసీస్ ను నిలువరించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో మెక్ క్లెంగన్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ ను కివీస్ వైపుకు తిప్పింది. రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన సమయంలో బౌలింగ్ వేసిన క్లెంగన్, ఆ ఓవర్ లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఆసీస్ పరాజయం దాదాపుగా ఖాయమైంది.

చివరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సి ఉండగా, ఆస్ట్రేలియా కేవలం 10 పరుగులే చేయడంతో… 8 పరుగుల తేడాతో కివీస్ దాయాది దేశంపై విజయం సాధించింది. ఇక, మరో దాయాది పోరు శనివారం నాడు సాయంత్రం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. తొలి మ్యాచ్ లో కివీస్ చేతిలో దెబ్బ తినడంతో ఈ మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. మరి భారత్ ఏం చేస్తుందో… ఏమో..!