bank-holidays-march-2016ఈ వారంలో సుదీర్ఘ వారాంతం కారణంగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి నాలుగు రోజులు కాదు, వరుసగా 8 రోజులు ప్రభుత్వ రంగ బ్యాంకులు బంద్ కానున్నాయి. 24 నుంచి 31వ తేదీ వరకూ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.

24న హోలీ, 25న గుడ్ ఫ్రైడే పర్వదినాలున్న సంగతి తెలిసిందే. ఆపై 26న నాలుగవ శనివారం, ఆ వెంటనే ఆదివారం సెలవులు కాగా, 28 నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు నాలుగు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ దీర్ఘకాల డిమాండ్లను తీర్చాలని నిరసన బాట పట్టనున్నాయి. వీరి సమ్మె 31 వరకూ సాగనుంది. దీంతో బ్యాంకులు గురువారం నుంచి వచ్చే గురువారం వరకూ మూతపడనున్నాయి.