new Secretariat building in Visakhapatnam జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదకు తెచ్చిన నాటి నుండీ విశాఖపట్నంలో సచివాలయం ఎక్కడ వస్తుంది అనేదాని మీద రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మిలీనియం టవర్స్ అనగా తాజాగా సచివాలయం కొత్తగా నిర్మించాలి అనే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కాపులుప్పాడ కొండపై ఐటీ సంస్థల కోసం గత ప్రభుత్వం ఐటీ లేఅవుట్‌ను రూపొందించింది. అదానీ సంస్థ ఆ కొండపై డేటాపార్క్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఆ కొండ మొత్తాన్ని అదానీ సంస్థకే కేటాయించారు.

అయితే ప్రభుత్వం మారకా అదానీ సంస్థ 70,000 కోట్లు అనుకున్న పెట్టుబడిని 3,000 కోట్లకు కుదించింది. ఈ నేపథ్యంలో ఆ పెట్టుబడికి అనుగుణంగా మరోచోట స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాపులుప్పాడ కొండ మొత్తాన్ని సచివాలయం, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నారు.

కాపులుప్పాడ కొండలపై మొత్తం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇప్పటికే 250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్‌ వేయగా 175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఆ కొండకు ఆనుకుని ఉన్న ఇతర కొండల భాగాలనూ చదును చేసి మరో 600 ఎకరాల భూమిని వినియోగంలోకి వస్తుంది. అయితే అమరావతిలో పూర్తయిన నిర్మాణాలను వదిలేసి మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపడతాం అంటే ప్రభుత్వం పై విమర్శలు రావొచ్చు.