Jagan To Revisit His Decision For The First Time?ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా రూపకల్పన పనిని ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని రూపొందించిన ప్రభుత్వం… ఇప్పుడు ఆ కమిటికి అనుబంధంగా ఇంకో నాలుగు కొత్త కమిటిలు ఏర్పాటు చేసింది. ఆ నాలుగు నాలుగు సబ్ కమిటీల కోసం ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు.

కొత్త జిల్లా సరిహద్దులు, సమస్యలు పరిశీలనకు, జిల్లాల్లో మౌలిక సదుపాయాఆల కల్పనకు ఒక కమిటీ, ఐటి సంబంధిత అంశాలకోసం మరో కమిటీ… ఇలా నాలుగు కమిటీలను నియమించారు.అంతేకాక జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన పది మంది సభ్యులతో కూడా కమిటీలను ఏర్పాటు చేశారు. సబ్ కమిటీల కర్యకలాపాలకోసం ప్రత్యేక సచివాలయం ఆరు నెలలు కొనసాగుతుందని తెలిపారు.

పాదయాత్ర సందర్భంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తా అని జగన్ వాగ్దానం చేసారు. ఆ ప్రకారం 25 జిల్లాలు రావాల్సి ఉంది. అయితే అరకు నియోజకవర్గం ప్రస్తుతం నాలుగు జిల్లాల పరిధిలో ఉండటం.. చాలా పెద్దదిగా ఉండటంతో… ఒక జిల్లాగా కాకుండా రెండు జిల్లాలుగా చెయ్యాలి ప్రభుత్వం భావిస్తుంది.

దీనితో కొత్త జిల్లాలు ఇరవై ఆరు కాబోతున్నాయి. కొందరు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు సరి కాదని వాదిస్తున్నారు. ప్రతి 10-20 ఏళ్లకు పార్లమెంట్ నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. వాటిని బట్టి జిల్లాల ఏర్పాటు అనేది పూర్తిగా అసందర్భం అని వారి అభిప్రాయం.