new-close-up-ad-mahesh-babuఅడ్వర్ టైజ్మెంట్ రంగంలో జాతీయ స్థాయిలో ఉన్న హీరోలకు ధీటుగా బ్రాండ్లను సొంతం చేసుకోవడంలో ప్రిన్స్ మహేష్ బాబు దిట్ట అన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి క్లోజప్ టూత్ పేస్టు యాడ్ కూడా వచ్చి చేరింది. ఇటీవలే చిత్రీకరణ జరిపిన ఈ యాడ్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.

రెడ్ కాస్ట్యూమ్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు యధావిధిగా అదిరిపోగా, ఈ యాడ్ దాదాపుగా రెండు నిముషాల పాటు ఉండడం విశేషం. ‘క్లోజప్’ ఫేమస్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ సాగిన ఈ యాడ్ బహుశా టీవీలలోకి వచ్చేపాటికి సెకన్ల నిడివికి కట్ అవుతుంది గానీ, రెండు నిముషాల నిడివి గల ఈ ఫుల్ సాంగ్ ను ప్రిన్స్ ప్రియులు ఆస్వాదిస్తున్నారు.