new-500-rupees-noteకంగారులో పనులు చేస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు అన్న దానికి ప్రతీకగా… కొత్త 500 రూపాయల నోట్లు నిలుస్తున్నాయి. ముద్రణ లోపం ప్రజలను గందరగోళానికి గురి చేయగా, వెంటనే వెలుగులోకి వచ్చిన రిజర్వు బ్యాంకు అధికారులు, ముద్రణా లోపాన్ని ధృవీకరించారు. ‘ఎవరూ కంగారు పడాల్సిన పనిలేదని, నోట్లపై ముద్రణ ఎలా ఉన్నా కొత్త 500 రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే తాజాగా చవిచూసిన మరొక విషయం ఏమిటంటే… కొన్ని 500 నోట్లకు ఏకంగా తోకలు ఉండడం విశేషం. ముద్రణే కాదు, నోట్ల కటింగ్ కూడా సరిగా జరగలేదన్న దానికి నిదర్శనంగా ఓ తోక ఉన్న 500 రూపాయల నోటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమయభావన కారణంగా 500 నోట్ల ముద్రణలో పొరపాట్లు చోటు చేసుకున్నాయన్న మాట వాస్తవమే కానీ, మరి ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం ప్రజలు భావించలేదు. మరి ఈ తోకున్న 500 నోటుపై మీరూ ఓ లుక్కేయండి..!