New 2000 Rupees Note Chipకొత్తగా విడుదలైన 2 వేల రూపాయల నోట్ లో శాటిలైట్ కు సంకేతాలు పంపే నానో చిప్ ఉందన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదు, అసలు ఈ పుకారు ఎలా ఉందో అంటూ స్వయంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే ఇది అత్యంత సెక్యూరిటీతో కూడుకున్న నోట్ అని, ఈ నోట్లను బ్లాక్ మనీగా మారిస్తే కనిపెట్టేస్తామని కూడా ఆర్బీఐ అధికారులు చెప్పడంతో, ఈ నోట్ లో ఏదో ఉందన్న అనుమానాలను పలువురు వ్యక్తపరిచారు.

అయితే నిజంగానే 2 వేల రూపాయల నోట్ లో ఏమైనా ఉందా? దానికి సమాధానమే ఈ చిరిగిన నోటు. రెండు వేల రూపాయల నోటులో ‘నానో చిప్’ ఉందంటూ జరిగిన ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలుసుకునేందుకు, సదరు నోట్ ను చించి మరీ పరిశీలించారని సోషల్ మీడియాలో ఓ చిరిగిన నోట్ ను షేర్ చేసుకుంటున్నారు. రెండు ముక్కలుగా ఉన్న నోట్ లో ఎలాంటి చిప్ లేదన్న విషయం బహిర్గతం కాగా, అసలు ఈ చిరిగిన నోట్ వెనుక మరో కధ ఉందని తెలుస్తోంది.

కేరళలో 70 సంవత్సరాల ఒక బామ్మ 2 వేల రూపాయల నోటును చూసి, అది లాటరీ నోటో, బొమ్మ నోటో తెలుసుకోలేక పనికి రాదనుకుని చించివేసిందట. కష్టపడి బ్యాంకులో క్యూలో ఉండి, ఎక్స్చేంజి చేసిన నోట్లను పెట్టి, రీఫ్రెష్ అవుదామని వెళ్ళిన మనవడికి చిరిగిన నోట్ దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడట. దీంతో సరికొత్త నోటును తెచ్చుకున్నానన్న సంతోషం ఆ మనవడికి కొద్ది నిముషాల్లోనే ఆవిరి అయ్యింది.