netizens trolls on KTRమొన్న ఆ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అమరావతి శంకుస్థాపనకు వెళ్ళిన కేసీఆర్ వారికి ఒక 100 కోట్లు ప్రకటిద్దాం అనుకున్నారని కానీ ప్రధాని మోడీ ఏమీ ఇవ్వకపోవడంతో ఆయనను అవమానించి నట్టు అవుతుందని ఇవ్వకుండా వచ్చేశారని ప్రకటించారు. అప్పట్లో అమరావతికి మీరేమి ఇవ్వక్కర్లేదు ముందు ఆంధ్రకు పెండింగు విద్యుత్ బకాయిలు చెల్లించండి అంటూ రెచ్చి పోయారు తెలుగు తమ్ముళ్లు.

ఇప్పుడు తాజాగా వారికి ఇంకో ఆయుధం దొరికింది. 1200 కోట్ల మేర బకాయిలు పెరిగిపోవడంతో డిసెంబర్ 1 నుండి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని ఆరోగ్యశ్రీ హాస్పిటళ్ళ సంఘం ప్రకటించేసింది. మరోవైపు ఫీజు రీయింబర్సుమెంట్ పథకం కింద కూడా బకాయిలు పెరిగిపోవడంతో విద్యార్థుల మీద విద్యాసంస్థలు ఒత్తిడి పెంచుతున్నాయంట.

ఈ క్రమంలో అమరావతి సంగతి తరువాత మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణకు ఈ దుస్థితి తెచ్చారేంటి అని తెరాసను టార్గెట్ చేస్తున్నారు టీడీపీ వారు. నిజానికి ఈ పథకాలకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం తెలివిగా వాటిని రైతు బంధు వంటి కొత్త పథకాలకు మళ్లించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. ఒకవేళ నిజంగా డిసెంబర్ 1న ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే ఎన్నికల తరుణంలో తెరాసకు అది ఇబ్బందే.