వైరల్ : పాఠశాలా? అధికార పార్టీ ఆఫీసా?వికలాంగ విద్యార్థుల ముఖాలపై పార్టీ రంగులు పూసారన్న విమర్శల వర్షం ముగియక ముందే తాజాగా మరొక వివాదాస్పదమైన తీరుతో అధికార పార్టీ నేతలు ప్రజల ముందుకొచ్చేసారు. పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు చేసిన నిర్వాకం ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

పాఠశాల పేరు కనిపించకుండా వైసీపీ పార్టీ జెండాతో కప్పివేసిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అది విద్యార్థులు చదువుకునే పాఠశాల అనుకున్నారా? లేక వైసీపీ పార్టీ కార్యాలయం అనుకున్నారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

విద్యార్థులకు దేవాలయంగా భావించే పాఠశాలలో పార్టీ ప్రచారం కోసం పాకులాటలేమిటి? ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేసే రీతిలో వైసీపీ నేతలు ఉన్నట్లుగా కనపడడం లేదు. అందుకే దిగజారడానికి కూడా ఓ హద్దు ఉంటుందన్న విమర్శలు సోషల్ మీడియాను చుట్టుముట్టేస్తున్నాయి.

అమ్మ ఒడి పేరుతో పది వేలు ఇస్తున్నామని పిల్లలను పార్టీ ప్రచారాలకు వాడేస్తారా? విద్యార్థుల చదువుకు ఇస్తున్నారా? లేక పార్టీ కార్యకర్తలుగా వినియోగించుకోవడానికి ఇలాంటి పధకాలను రచిస్తున్నారా? విద్యార్థులతో వైసీపీ చేస్తోన్న రాజకీయాలను అత్యంత హేయమైన చర్యలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.