netizens are trolling to allu Sirish tweet‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ ఆ వేదికపై నుండి మిగతా భాషల్లో విడుదలవుతున్న సినిమాలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ అన్ని భాషల్లో సినిమా ఇండస్ట్రీలు బాగుండాలని సినిమాలు థియేటర్స్ లో బాగా ఆడాలని సంకేతమిచ్చాడు. అల్లు అర్జున్ స్పీచ్ కట్ చేసుకొని బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ అలాగే నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా బన్నీ కి థాంక్స్ చెప్పారు.

ఇక కరణ్ జోహాన్ ట్వీట్ ని కోట్ చేస్తూ అల్లు శిరీష్ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలకి మంచి టైం పాస్ అవుతుంది. “మా తాత బ్రతికి ఉంటె మీసం తిప్పే మూమెంట్ ఇది. బన్నీ నీ ఎదుగుదలతో, నీ మంచితనంతో నువ్వు మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావ్ కీప్ విన్నింగ్” అంటూ ట్వీట్ చేసి ఎగ్జైట్ అయ్యాడు శిరీష్.

దీంతో శిరీష్ ట్వీట్ కింద కామెంట్ల కామెడీ జరుగుతుంది. మీ తాత ఒక లెజెండ్ ఈ ట్వీట్ కి మీసం తిప్పడం ఏమిట్రా ? అని ఒకరు. అలాగే ఆ ట్వీట్ లో అల్లు అర్జున్ ని ట్యాగ్ చేయబోయి తన ఐడిని ట్యాగ్ చేసుకున్నాడు. దీంతో ముందు ఎవర్ని మెన్షన్ చేసావో చూసుకో.. ఈ మాత్రం దానికి మీ తాత మీసం తిప్పడమేంట్రా అంటూ గట్టిగా శిరీష్ పై కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.

నిజానికి అల్లు అర్జున్ చెప్పడం , బాలీవుడ్ వాళ్ళు ట్వీట్ చేసుకోవడం అక్కడి వరకూ బాగానే ఉంది. దీనికి అల్లు శిరీష్ ఎలివేషన్ ఇచ్చి ఓవర్ గా ఎగ్జైట్ అవ్వడం మాత్రం యాంటీ ఫ్యాన్స్ కి మింగుడు పడట్లేదు. అందుకే కామెంట్లతో శిరీష్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఏదేమైనా శిరీష్ ఇలాంటివి తగ్గించుకుంటే మంచింది అంటూ నెటిజన్లు కూడా ఫీలవుతున్నారు.