Allu Aravind -Mehreen -pirzadaనేటితరం యువతకు ఏ చిన్నది కనిపించినా, అందులో ఏదొకటి బొక్కలు వెతకడం సర్వసాధారణం అయిపోయింది. తత్ఫలితం… సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకోవడం! అందులో భాగంగానే తాజాగా అల్లు అరవింద్ వారి కంట పడ్డారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న “ఎఫ్ 2” షూటింగ్ ఇటీవల ప్రారంభం కాగా, ఈ వేడుకలో అల్లు అరవింద్ చేసిన ఓ ఫీట్ నెటిజన్లకు ఆహారంగా మారింది.

వెంకటేష్, వరుణ్ తేజ్ లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మెహ్రీన్ పక్కన నిల్చున్న అల్లు అరవింద్, ఆమె ఎత్తుకు తగ్గట్లుగా పైకి ఎగిరి కామెడీ చేయాలని ప్రయత్నించారు. ఇది పక్కనే ఉన్న హీరోయిన్ మెహ్రీన్ ను నవ్వించింది గానీ, నెటిజన్ల దృష్టిలో మాత్రం ట్రోలింగ్ కు గురవుతోంది. అల్లు గారు చేసిన ఫీట్ అలా ఉంది మరి!