ఇటీవల కాలంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సంచలనంగా మారిన “స్క్విడ్ గేమ్” గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ వెబ్ సిరీస్ గా మారిన ఈ షో ప్రస్తుతం తెలుగులోకి తర్జమా అవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను తెలుగు ట్రైలర్ విడుదల చేస్తూ నెట్ ఫ్లిక్స్ తెలిపింది.

మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్న ఈ “స్క్విడ్ గేమ్” సిరీస్ తెలుగు, తమిళ, హిందీ భాషలలోకి అనువాదం జరుగుతోంది. డబ్బింగ్ కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తి కాగానే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఇంగ్లీష్ లో చూడలేక ఈ వెబ్ సిరీస్ ను మిస్ అయ్యామని భావించిన తెలుగు ప్రేక్షకులకు ఈ డబ్బింగ్ కోసం వేచి చూస్తారని చెప్పడంలో సందేహం లేదు.

గతంలో “మనీ హేస్ట్” వెబ్ సిరీస్ విషయంలోనూ నెట్ ఫ్లిక్స్ ఇదే రకమైన ధోరణిని అనుసరించిన విషయం తెలిసిందే. ముందుగా ఒరిజినల్ భాషలలో విడుదల చేసి సంచలనం అయిన తర్వాత ఇండియన్ భాషలలోకి ఈ సిరీస్ ను డబ్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. ఇపుడు ‘స్క్విడ్ గేమ్’ కూడా ‘మనీ హేస్ట్’ను ఫాలో అవుతుందన్న మాట!