nenu_sailaja_Ram_Pothineniరామ్ కు మరో షాక్ తగలబోతోంది… అసలే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘నేను.. శైలజ…’ చిత్రాన్ని ఎలాగోలో నెట్టుకోద్దామని ప్రయత్నిస్తుంటే… రాంగోపాల్ వర్మ “కిల్లింగ్ వీరప్పన్” సినిమా రూపంలో పెద్ద షాక్ తగలబోతోంది. ఇప్పటికే కన్నడలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న “కిల్లింగ్ వీరప్పన్”పై భారీ అంచనాలు ఉండడంతో ధియేటర్ల నుండి ఎత్తివేయడానికి చూస్తున్నారు. అలాగే ప్రేక్షకుల ఆసక్తి కూడా వర్మ చిత్రం వైపే ఉంది.

బరిలో ఏ చిత్రాలు పోటీ లేకపోవడంతో ఇప్పటివరకు 5 కోట్లు వసూలు చేసి ‘అట్టర్ ఫ్లాప్’ కంటే ‘ఫ్లాప్’ నయం అన్న రీతిలో భావిస్తున్న హీరో రామ్ ను “నేను.. శైలజ…” చిత్రం సంపూర్ణేష్ బాబు గ్రేడ్ లోకి పడేసింది. ‘ఒంగోలు గిత్త, శివమ్’ కంటే పర్వలేదనిపించినా గానీ ‘నేను.. శైలజ…’ రామ్ కు అట్టర్ ఫ్లాప్ నే మిగిల్చింది. మొత్తమ్మీద దీంతో 2016 సంవత్సరం రామ్ కు మరో ఫ్లాప్ ఏడాదిగా మిగిలిపోయింది.

ఇదంతా రామ్ చెప్పిన ‘న్యూస్ ఛానల్’ ప్రసారం చేసిన తాజా కధనం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందనేది ట్రేడ్ వర్గీయులకు, సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. రోజుకొక కధనంతో రామ్ ను టార్గెట్ చేసిన సదరు ఛానల్ ‘అభిమతం’ ఏమిటన్నది ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. అసలు ఈ ‘రగడ’ ఎప్పుడు, ఎలా, ఎందుకు ప్రారంభమైందో తెలియక రామ్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.