nenu-sailaja-talk‘హిట్’ అనే మాట హీరో రామ్ కు అందని ద్రాక్షలా మారింది. వరుస వైఫల్యాలు కెరీర్ ను డోలాయమాన పరిస్థితుల్లో పడేస్తున్న తరుణంలో మేల్కొని, తన సహజ సిద్ధ శైలికి భిన్నంగా “నేను.. శైలజ…” ద్వారా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త సంవత్సరం కానుకగా విడుదలైన ఈ సినిమా రామ్ ఆశించిన ఫలితాన్ని అందించిందా? 2016 అయినా రామ్ ఫేట్ ను మార్చిందా? అంటే మరో రెండు, మూడు రోజులు వెయిట్ చేయాలి అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

‘వీకెండ్’లో చూడదగ్గ చిత్రంగా టాక్ తెచ్చుకున్న “నేను.. శైలజ…” చిత్రానికి రాబోయే రెండు, మూడు రోజుల్లో ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందనే దానిపై చిత్ర ఫలితం ఆధారపడి ఉంది. హీరోగా రామ్, హీరోయిన్ గా కీర్తి సురేష్ అభినయాలు, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, దేవిశ్రీ పాటలు, ఫస్టాఫ్, క్లైమాక్స్ ప్లస్ పాయింట్స్ గా నిలువగా, ఊహించదగే కధ కావడం, అదే రొటీన్ సెంటిమెంట్, సెకండాఫ్ సాగదీత సినిమాకు మైనస్ పాయింట్స్ గా మారాయి.

బాక్సాఫీస్ వద్ద మరే చిత్రం లేకపోవడం కూడా “నేను.. శైలజ…” చిత్రానికి కలిసి వచ్చే అంశం. ప్రేక్షకుల ఆదరణ చూరగలిగితే ధియేటర్లలో సంక్రాంతి వరకు సందడి చేయడం ఖాయం. అదే జరిగితే రామ్ గట్టేక్కినట్టే! సినిమాకు లభించిన టాక్ రీత్యా, రామ్ ఈ సారి ‘హిట్’ తన ఖాతాలో వేసుకోవచ్చు అనేది ట్రేడ్ విశ్లేషకుల మాట. గతేడాది జనవరి 1వ తేదీన ‘రఘువరన్ బిటెక్’ ద్వారా సూపర్ హిట్ అందుకున్న స్రవంతి రవికిషోర్, ఈ సారి కూడా అదే ఫీట్ రిపీట్ చేయవచ్చని భావిస్తున్నారు.