nenu sailaja songరామ్, కీర్తి సురేశ్ జంటగా నటించిన “నేను… శైలజ…” చిత్రం ఆడియో విడుదలైంది. సంగీత తరంగం దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన 5 పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఇన్ స్టంట్’ హిట్ అందుకున్న ఈ ఆల్బమ్ లో సాగర్ ఆలపించిన ‘శైలజ…’ అనే సాంగ్ యువతను ఒక ఊపు ఊపుతోంది. రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యం పదే పదే వినాలనిపించే విధంగా ఉండడంతో ప్రస్తుతం ‘ఎఫ్.ఎం’ రేడియోలలో కూడా హాట్ హాట్ గా వినపడుతోంది.

‘నువ్వెందుకు మారావే… శైలజ..,
శైలజ… శైలజ… శైలజ… గుండెల్లో కొట్టావే డోలు బాజా..,
శైలజ… శైలజ… శైలజ… నీ కోసం చేయాలా ప్రేమ పూజా…’ అంటూ సాగే లిరిక్స్ అదిరిపోయాయి. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ‘శ్రీమంతుడు’ సినిమా పాటల తర్వాత సరైన సాంగ్స్ లేక వెలవెలబోతున్న సంగీత ప్రియులను “నేను… శైలజ…” పాటలు సమ్మోహితులను చేస్తున్నాయి. మొత్తంగా సినిమా విడుదలకు ముందు పాటలకు లభిస్తున్న ఆదరణతో చిత్ర యూనిట్ కొత్త ఉత్సాహంలో మునిగి తేలుతోంది.