Rana Daggubati Names His Top 5 Friends in the Industry మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా తలపడడానికి సర్వం సిద్ధమైన నేపధ్యంలో… తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో రానా హీరోగా తెరకెక్కిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమా వాయిదా పడిందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తమిళ వర్షన్, చివరి నిముషంలో విడుదల ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది.

సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఉన్న ఈ సినిమా ఏ కారణంగా వాయిదా పడిందనే విషయం ఇంకా స్పష్టత రాలేదు గానీ, తమిళ వర్షన్ అయితే ఈ శుక్రవారం నాడు విడుదల కావడం లేదన్న టాక్ బలంగా ఉంది. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించాల్సి వుంది. ఒకవేళ వాయిదా పడటం నిజమే అయితే… ఎందుకు ఆగిందో, అలాగే కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. మార్కెట్ వర్గాల్లో మాంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా చివరి నిముషంలో వాయిదా పడితే, ఆ క్రేజ్ కొనసాగించడం కష్టమవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!