Nene-Raju-Nene-Mantri-Teaser-Talk ఒకానొక సమయంలో తెలుగు సినిమాను ఒక ఊపు ఊపిన దర్శకుడు తేజకు, గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ అన్న పదం దూరమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా… దాని దరి చేరుకోలేకపోతున్న తేజ, తాజాగా రానా హీరోగా “నేనే రాజు నేనే మంత్రి” సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాజకీయ కధ నేపధ్యంలో సాగే ఈ సినిమా ఫస్ట్ టీజర్, రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులను పలకరించింది.

ఫస్ట్ షాట్ తో మొదలైన అనూప్ రూబెన్స్ సంగీతం హైలైట్ గా ఈ టీజర్ అదరగొడుతోంది. సినిమా టైటిల్ అయిన “నేనే రాజు నేనే మంత్రి” థీమ్ ప్రేక్షకులకు చేరువయ్యేలా రానా చెప్పిన డైలాగ్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. అలాగే జైలులో ముఖానికి నల్లగుడ్డ కప్పుకుని రానా నడిచే వచ్చే సన్నివేశం కూడా కొత్తగా ఉండడంతో… మొత్తమ్మీద తన మూస పద్దతికి దూరంగా ఈ సినిమాను తెరకెక్కించారేమో అన్న భావన ప్రేక్షకులలో వ్యక్తమవుతోంది.