Nela Ticket public talk‘ఏదీ నేను సీరియస్ గా తీసుకోను… సినిమా దొబ్బింది… అదే నా ఎనర్జీ… వాట్ నెక్స్ట్…’ ఇది కొద్దిరోజుల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్వయంగా రవితేజ చేసిన వ్యాఖ్యలు. నిజమే… ‘నేలటిక్కెట్టు’ సినిమా ఫలితం ఇలా వస్తుందని ముందే తెలిసి ఈ వ్యాఖ్యలు చేసారో లేక తన చిత్రాలు ఫ్లాప్ అయినపుడు నిజంగానే రవితేజ ఇలా వ్యవహరించేవారో ఏమో గానీ, ప్రస్తుతం వెలువడుతోన్న ‘నేలటిక్కెట్టు’ టాక్ తో రవితేజ ఫుల్ ఎనర్జీలో ఉన్నారని చెప్పవచ్చు.

ఈ సినిమాకు సంబంధించి ‘సింగిల్ టాక్’ ప్రేక్షకుల నుండి వెలువడుతోంది. అదేనండి… డిజాస్టర్ అన్న టాక్. అదే రవితేజ భాషలో చెప్పాలంటే ‘సినిమా దొబ్బింది’ అని! ఇంకేముంది మాస్ మహారాజాకు కావాల్సిన ఎనర్జీని ‘నేలటిక్కెట్టు’ సినిమా ఫలితం ఇచ్చేసినట్లే! సాధారణంగా ఏ సినిమాకైనా డివైడ్ టాక్ వస్తుందని అంటారు, కానీ ‘నేలటిక్కెట్టు’ సినిమా చూసిన ప్రేక్షకులందరూ ముక్తకంఠంతో ‘సింగిల్ టాక్’ను వ్యక్తపరుస్తున్నారు. ఆ విధమైన టాక్ ను తీసుకురావడంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల బాగా విజయవంతం అయ్యారు మరి!

చిన్న చిన్న దర్శకులు, హీరోలు కూడా సరికొత్త కధలను ఎంపిక చేసుకుంటూ వైవిధ్యం ప్రదర్శిస్తుంటే… ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న రవితేజ అవే మూసకధలను ఎంపిక చేసుకోవడం ఒక విధంగా అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్నట్లే భావించవచ్చు. సినిమా దొబ్బితే రవితేజకు ఎనర్జీ వస్తుందేమో గానీ, ఆయనను అభిమానించే ఫ్యాన్స్ కు కాదన్న ఒక చిన్న లాజిక్ ను మాస్ మహారాజా మిస్సయ్యారు. ఆ ప్రభావం ఫ్యాన్స్ పైన పడడం వలనే, ఈ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. ‘వాట్ నెక్స్ట్’ అనుకోవడమే ‘నేలటిక్కెట్టు’ చిత్ర యూనిట్ వంతు!