Nela-Ticket-Movie-Reviewరెండేళ్ళ పాటు విరామం తీసుకుని గతేడాది “రాజా ది గ్రేట్” రూపంలో గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజా రవితేజ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో ‘టచ్ చేసి చూడు’ అంటూ ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించగా, ఆడియన్స్ మాత్రం ఆ ధియేటర్లను టచ్ చేయలేదు. దారుణమైన పరాజయం తర్వాత మరికొద్ది గంటల్లో “నేల టిక్కెట్టు” టైటిల్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నాడు రవితేజ.

‘సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి అభిరుచి గల దర్శకుడిగా పేరుగాంచిన కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ఐటమ్స్ లో ఒక్కటి కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. పాటలకు పాటలు, టీజర్, ట్రైలర్, అలాగే వీడియో సాంగ్స్ ప్రోమోలు… ఇవేమీ కూడా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయాయి. ఈ ప్రభావం ఓపెనింగ్స్ పై పడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

పక్కా మాస్ ఎంటర్టైనర్ కావడంతో, ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ను ఊహించలేం. ఇటీవల కాలంలో యుఎస్ ప్రేక్షకులు షాక్ ఇచ్చే తీర్పులను అందిస్తున్నారు గనుక, ‘నేల టిక్కెట్టు’కు కూడా అలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారేమో చూడాలి. రిలీజ్ కు ముందుగా పెద్దగా ఆసక్తి కలిగించని ఈ సినిమా రిలీజ్ తర్వాత సొంతం చేసుకునే టాక్ ను బట్టే, బాక్సాఫీస్ వద్ద “నేల టిక్కెట్టు” రేంజ్ డిసైడ్ అవుతుంది. ‘రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి’ సినిమాలతో కళకళలాడుతోన్న టాలీవుడ్ లో ‘నేల టిక్కెట్టు’ ఏం ప్రభావితం చూపనుందో..?!