సాహో చూడగానే ప్రభాస్ ఫాన్స్ పిచ్చెక్కిపోవడం ఖాయం

neil nitin mukesh about saaho movieయంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘సాహో’ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన తొలి పాట ‘సైకో సయ్యా’ పూర్తి వీడియో నిరాశపరచింది. దీనితో నిర్మాతలు తరువాతి ప్రమోషన్లు మరింత కట్టుదిట్టంగా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా చేసిన నీల్ నితిన్ ఈ సినిమా గురించి భారీగా హైప్ చేశాడు.

“ఈ సినిమా అంచనాలను మించిపోతుంది. బాహుబలి తరువాత సరైన సినిమా పడింది ప్రభాస్ కు. ఈ సినిమా చుసిన ప్రభాస్ అభిమానులు పిచ్చెక్కిపోతారు,” అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీనితో ప్రభాస్ ఫాన్స్ భూమి మీద లేరు. 300 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై దేశవ్యాప్తంగా ట్రేడ్, ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

సాహో చిత్రంలో బాలీవుడ్ న‌టి శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దక్షిణాదిన ఇదే ఆమె మొదటి చిత్రం. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.’ బాహుబలి తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ట్రేడ్ కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఇది గనుక హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు.

Follow @mirchi9 for more User Comments
Narendra Modi and Amit Shah Leave Jagan Tensed?Don't MissModi and Amit Shah Leave Jagan Tensed?Andhra Pradesh Government is likely to repeal the AP CRDA act in the Assembly on...Can-Music-Change-World-Famous--Lover-FateDon't MissCan Music Change World Famous Lover Fate?World Famous Lover is the upcoming film of Vijay Deverkonda. Kranthi Madhav helms the project...RRR Movie Release Date 2nd october 2020Don't MissNew Release Date on the Way for RRRFrom the last few months, there are speculations about a possible change in the Release...Alliance with BJP Solves one Important Problem of JanasenaDon't MissAlliance with BJP Solves one Important Problem of JanasenaThe alliance between Janasena and BJP is now finalized. Both the parties have announced that...Vijaya-Sai-Reddy's-Letter-to-Amit--Shah-BackfiredDon't MissVijaya Sai Reddy's Letter to Amit Shah Backfired?Rajya Sabha MP Vijaya Sai Reddy, the Accused Number 2 in all the disproportionate and...
Mirchi9