Neelam Sahniఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా చేశారు. నీలం సాహ్నీ రాజీనామాకు వెంటనే ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఏపీ ఎస్ఈసీగా తాజాగా నియమితులైన నీలం సాహ్నీ ఈ నెలాఖరున ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇక పోతే ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అయితే ఏడాది క్రితమే ఆయన చంద్రబాబు నియమించిన వ్యక్తి అని సాగనంపడానికి విశ్వప్రయత్నం చేశారు జగన్. ఆయన స్థానంలో రిటైర్డ్ జడ్జి కానగరాజ్ ను తెచ్చారు. అయితే ఆయన నియామకాన్ని హై కోర్టు పక్కన పెట్టింది.

మాజీ ఐఏఎస్ అధికారులు నిష్పాక్షికంగా ఉండరని… అందుకే మాజీ న్యాయమూర్తులు ఆ పదవికి అవసరమని జగన్ చెప్పుకొచ్చారు. కంగరాజ్ నియామకాన్ని హైకోర్టు కొట్టివేశాకా దళితుడికి పదవి ఇస్తే ఓర్వలేరా అంటూ టీడీపీ అని అట్టాక్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్ నే ఎస్ఈసీగా నియమించడం గమనార్హం.

దళితుడైన కానగరాజ్ ను పూర్తిగా మర్చిపోయారు కూడా. ఏదో అప్పుడు ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టడానికే గానీ జగన్ కు వాటి మీద నిబద్దత లేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ ప్రవచనాలు చెప్పినట్టుగా నీతులు చెప్తారు… కానీ చేతలు నిల్ అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు.