Needi-Naadi-Oke-Katha-Official-TEASERతెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన నారా రోహిత్ దారి రొటీన్ కాదన్న విషయం తెలిసిందే. అలాగే నిర్మాతగా చేసే సినిమాలలో కూడా తన మార్క్ ను చూపిస్తున్నాడు. సరిగ్గా ఇదే బాటలో హీరో శ్రీవిష్ణు కూడా పయనిస్తున్నాడని చెప్పొచ్చు. విలక్షణమైన సినిమాలు చేస్తున్న శ్రీవిష్ణు, ఇటీవలే ‘మెంటల్ మదిలో’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించగా, తాజాగా “నీది నాది ఒకే కధ” రాబోతున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదల కాగా, అందులో శ్రీవిష్ణునే హైలైట్ గా నిలిచాడు.

ఎదగని కొడుకుపై ఓ తండ్రి చూపిస్తున్న ఆవేదనను ఈ టీజర్ లో చూపించగా, ఆ కొడుకుగా శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణా స్లాంగ్ తో మాట్లాడడం కొత్తగా ఉండగా, తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్ని సహజత్వంగా చిత్రీకరించిన విధానం బాగుంది. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ఆకట్టుకోగా, నటుడిగా శ్రీవిష్ణు ఒక్కో మెట్టు ఎదుగుతున్నట్లుగా కనపడుతున్నాడు. ‘మెంటల్ మదిలో’ తర్వాత మరోసారి విమర్శకుల ప్రశంసలను అందుకుంటాడేమో చూడాలి.