NC19 Naga Chaitanya Middle-Classమజిలీ వంటి మంచి హిట్ ఇచ్చిన నాగ చైతన్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా లో నాగ చైతన్యకు సంబంధించిన టీజర్‌ను ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్‌ తో సినిమాలో చైతూ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో రివీల్‌ చేశారు.

కొంచెం మజిలీ లుక్ లా అనిపించే లుక్‌లో కనిపిస్తున్న చైతూను మిడిల్ క్లాస్ అబ్బాయి గా పరిచయం చేశారు. ఇల్లు ఊడవడం, డబ్బు పొదుపు చెయ్యడం, పిల్లలతో కలిసి ఆనందంగా ఎంజాయ్‌చేస్తున్న సీన్‌తో పాట ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకున్న సీన్స్‌తో టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. మొత్తానికి 25 సెకండ్ల ఈ వీడియో సినిమా గురించి ఏమీ చెప్పకపోయినా ఇంప్రెస్సివ్ గా ఉందనే చెప్పుకోవాలి.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ దాస్‌ నారంగ్‌, పీ రామ్‌ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీహెచ్‌ పవన్‌ సంగీతమందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య రియల్‌ లైఫ్‌ మామ వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో సురేష్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌ 13న విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైతూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజే ప్రకటించవచ్చని అంటున్నారు.