KCR-Government-Taking-People-For-Grantedతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపైన, ప్రభుత్వంపైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. ఆ మధ్య ఎన్ కౌంటర్ అయిన గ్యాంగ్ స్టర్ నయీం కు చెందిన సొమ్మును ముఖ్యమంత్రి కుటుంబం, ప్రభుత్వ పెద్దలు కొందరు దోచుకున్నారని ఆయన ఆరోపణ.

పైగా నయీమ్ ఆస్తులు దాదాపుగా ఇరవైవేల కోట్ల రూపాయలు అని ఆయన అంటున్నారు. నయీమ్ చనిపోయి నెలలు గడిచిపోయినా ఇంతవరకు కేసులో పురోగతి లేకపోవడమే దానికి నిదర్శనం అని ఆయన చెప్పుకొచ్చారు. నయాం కేసులో సంబందం ఉన్న టిఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చినా ఆ కేసు ముందుకు సాగలేదు అనేది మాత్రం నిజం. ఇటీవలే ప్రభుత్వం మీద ఆధారాలు లేకుండా విమర్శలు చేసే వారిని జైలుకు పంపడం ఖాయం అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రకటించారు. ఇటువంటి ఆరోపణలకు ఆధారాలు లేకపోతే ఈయన కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.