nayanthara-to-marry-his-boy-friend-vignesh-shivanదక్షిణాదిలో అగ్ర కథానాయకి నయనతార… తమిళ దర్శకుడు విఘ్నేశ్‌శివన్ తో దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రేమాయణం సాగిస్తుంది. వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారంటూ తరచు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఏ ఒక్కరికి సంబంధించిన విశేషం అయినా కలిసి వేడుకగా జరుపుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు అధికారికంగా పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకుంటున్నారని సమాచారం. వీరి పెళ్లి వచ్చే డిసెంబర్‌ 25న జరగనుందనే టాక్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ జంట వివాహ వేడుకలు 5 రోజుల పాటు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుందట. అయితే పెళ్లి కి పెద్దగా హడావిడి చెయ్యాలనుకోవడం లేదంట.

విదేశాల్లోనూ క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా జరుపుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. చాలా కొద్ధి మంది స్నేహితులు, బంధువులను పిలిచి ఈ తతంగం ముగించాలని అనుకుంటున్నారట. అలాగే చెన్నైలో రిసెప్షన్ కూడా పెట్టే ఉద్దేశం లేదట. పెళ్లి కి సంబంధించిన ఫోటోలు మాత్రం ప్రెస్ కు విడుదల చేస్తారు.

నయనతార చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ సినిమా సైరా నరసింహ రెడ్డిలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మరియు మలయాళ భాషలలో ఒకేసారి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల అవుతుంది. ఎప్పటిలానే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ కు కూడా హాజరుకాకపోవడం విశేషం.